📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

📰 Generate e-Paper Clip

 

వైఎస్సార్ కడప జూన్ 8(కడప మనస్సాక్షి):

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి  అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవన్ సమావేశపు హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి  ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తోందన్నారు. ఈ వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని అన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!