📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలలు

పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలలు

📰 Generate e-Paper Clip

జమ్మలమడుగు జూన్8:పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి ముందస్తుగానే పుస్తకాలు కొనుక్కోవాలని ఒత్తిడి తెచ్చి డిమాండ్ చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ సహయ కార్యదర్శి హరిబాబు స్థానిక ఆర్డిఓ కార్యాలయంలోని శిరీష కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠ్యపుస్తకాలు కొనాలనే పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రవేట్ పాఠశాలు.పాఠ్యపుస్తకాలను ముందే కొనుక్కోవాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి ఒత్తిడి చేస్తున్నారు.అంతేకాకుండా ప్రీ ప్రైమరీ,ప్రైమరీ,యూకేజీ, నర్సరీ,పిల్లల బుక్స్ 3000 రూపాయలు నుంచి 10,000 వరకు అమ్ముతున్నారు.అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఇంకెంత రేటు ఉంటాయో చూస్తుంటేనే భయమేస్తుందన్నారు.అంతే కాకుండా దీని తోడు వ్యాన్ ఫీజు హాస్టల్ ఫీజు అంటూ ఒక విద్యార్థి నుంచి లక్ష రూపాయల వరకు ఫీజుల దందా జరుగుతుందన్నారు.ఇప్పటినుంచే పేద కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను ప్రవేట్ విద్యాసంస్థలు మంచి విద్య తో అని ఒత్తిడి చేసి మానసికంగా వేధించడం మొదలుపెట్టారన్నారు.చదువు పేరుని అడ్డుపెట్టుకొని విద్యార్థులను,విద్యార్థుల తల్లిదండ్రుల పైన బారం మోపి వేల,లక్షల రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు.అంతేకాకుండా ఇన్ని ఏళ్ల లక్ష రూపాయలు ఫీజులు కడుతున్న సరైనటువంటి మౌలిక వసతులు కల్పించ లేకుండా ఎక్కడో చోట చిన్నపిల్లలపై అగైత్యాలు ప్రాణా పాయస్తులు జరుగుతూ వస్తున్నాయన్నారు.ఒక జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల పేరుతోనే కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ,అధికంగా ఫీజులు తీసుకుంటూ ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలను కూడా ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.అయినప్పటికీ కూడా రాష్ట్ర,జిల్లా,మండల విద్యాశాఖ అధికారులు మాత్రం ఏ మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం రహస్యం ఏమిటో అని వారన్నారు.అలాగే కార్పొరేట్ విద్యాసంస్థల శక్తులకు,ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తూ కాయడం జరుగుతుందని వారన్నారు.విద్యాసంస్థల్లో ఎలాంటి వసతులు లేకుండా కూడా అన్నీ మా వద్ద ఉన్నాయి మా పాఠశాలలు గొప్పవని విద్యార్థులు తల్లిదండ్రుల ను మోసం చేసే విధంగా ఈరోజు చైతన్య,నారాయణ వంటి విద్యాసంస్థలు తయారయ్యాయి.ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలో చేపడతామని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు దస్తగిరి,మదు బాబు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!