📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నిపుణుల సలహాలు, పోషకాహారం పై నేడు అవగాహన సదస్సు 

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నిపుణుల సలహాలు, పోషకాహారం పై నేడు అవగాహన సదస్సు 

📰 Generate e-Paper Clip

  • పిల్లలకి ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి “టమ్మీ టాట్స్‌’ ఆవిష్కరణ మిల్లెట్‌ కుకిస్ , సెరె లవ్‌, మిల్క్‌ మిక్స్‌తో చిన్నారుల పోషణపై దృష్టి
  • పిల్లల పోషకాహార లోపానికి వైద్య దంపతుల పరిష్కారం – తల్లుల విశ్వాసం గెలుచుకున్న “సెరెలవ్‌”
  • పిల్లల్లో పెరుగుతున్న పోషకాహార లోపాన్ని గుర్తించిన ఆయుష్ హాస్పిటల్ శిశు వైద్య దంపతులు డా. మహేష్‌ – డా. వినూత లు

గాలివీడు జూన్ 9 కడప మనస్సాక్షి : పిల్లల్లో పెరుగుతున్న పోషకాహార లోపాన్ని గుర్తించిన శిశు వైద్య దంపతులు డా. మహేష్‌ – డా. వినూత వైద్య సేవలతో పాటు సమాజానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిశువులకు మొదటి పరిపూరక ఆహారంగా ఉపయోగపడేలా చక్కెర, ప్రిజర్వేటివ్స్‌ లేని అధిక పోషక విలువలతో కూడిన “సెరె లవ్‌” బేబీ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విదేశీ బ్రాండ్లకు బదులుగా సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ ఉత్పత్తికి తల్లుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మిల్లెట్స్‌ & డ్రైఫ్రూట్స్‌ కుకీస్‌, డ్రైఫ్రూట్స్‌ మిల్క్‌ మిక్స్‌ వంటి ఉత్పత్తులను కూడా అందిస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల కంటే ప్రజలకు చేరువగా, తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తు కోసం ఈ వైద్య దంపతులు చేస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. “ప్రతి బిడ్డకు మంచి పోషకాహారం అందాలి” అనే లక్ష్యంతో వారి ప్రయాణం కొనసాగుతోంది. పిల్లలు తల్లిదండ్రులు 6 నెలల పైబడిన మీ చిన్నారికి సరైన పోషకాహారం గురించి తెలుసుకోవడానికి జూన్‌ 10న అనగా బుదవారం గాలివీడు మండల కేంద్రం స్థానిక ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ లో జరుగుతున్న టమ్మి టాట్స్(Tummy Tots) బేబీ న్యూట్రిషన్‌ క్యాంప్‌కు విచ్చేయండి. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నిపుణుల సలహాలు, పోషకాహార అవగాహన మరియు ప్రత్యేక మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయి. మీ చిన్నారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అవగాహన సదస్సు లో తప్పక పాల్గొని సదస్సు ను విజయవంతం చేయాలని ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు డా.మహేష్.. డా.వినూత లు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!