📄 ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్9వ వార్డులో బీజేపీ జోరు.. ఇంటింటా ప్రచారం

9వ వార్డులో బీజేపీ జోరు.. ఇంటింటా ప్రచారం

📰 Generate e-Paper Clip

కడప (మనస్సాక్షి): కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ ప్రజలకు నమస్కరిస్తూ బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, డివిజన్ అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తానని బత్తల పవన్ కుమార్ తెలిపారు. తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. “9వ వార్డులో బీజేపీ జోరు.. ఇంటింటి ప్రచారం.. ప్రజల ఆశీర్వాదం” అంటూ ప్రచారం నిర్వహించారు. బత్తల పవన్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి 9వ డివిజన్ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి స్పందన లభించిందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు గౌరీ శంకర్, గంగాధర్, కృష్ణారెడ్డి, మహబూబ్ వల్లి, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!