📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్9వ డివిజన్‌లో బీజేపీ ఇంటింటి ప్రచారం

9వ డివిజన్‌లో బీజేపీ ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

కడప (మనస్సాక్షి) : కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న బత్తల పవన్ కుమార్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ 9వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గౌరీ శంకర్, బాలయ్య, కంబగిరి, మహబూబ్ వల్లి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

“మార్పు కోసం ఓటు.. అభివృద్ధి కోసం ఓటు.. బత్తల పవన్ కుమార్‌కు ఓటు” అంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!