📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పులివెందుల విద్యుత్ డీఈగా నాగేంద్ర బాధ్యతల స్వీకరణ

పులివెందుల విద్యుత్ డీఈగా నాగేంద్ర బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

పులివెందుల జూన్ 03 : పులివెందుల విద్యుత్ డివిజన్ నూతన డీఈగా నాగేంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక డివిజన్ కార్యాలయంలో ఇటీవల విద్యుత్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ డీఈగా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వేంపల్లి పట్టణంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర ఇటీవల ప్రమోషన్ పొంది డీఈగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డీఈ నాగేంద్ర మాట్లాడుతూ,తనకు అప్పగించిన ఈ బాధ్యతను విద్యుత్ అధికారులు, సిబ్బంది సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. విద్యుత్ వినియోగదారులందరికీ న్యాయం చేసే విధంగా,నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు నూతన డీఈ నాగేంద్రను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,యూనియన్ నాయకులు,సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!