📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఏడీగా బాధ్యతలు స్వీకరించిన రమేష్..!

ఏడీగా బాధ్యతలు స్వీకరించిన రమేష్..!

📰 Generate e-Paper Clip

కడప, జులై 9 : సమాచార పౌర సంబంధాల శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా సహాయ సంచాలకులు (ఏ.డి.)గా ఏ. రమేష్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఒంగోలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డిపిఆర్వోగా భాద్యతలు నిర్వహించిన ఆయన.. పదోన్నతి పొంది అదే శాఖలో కడప ఏడి గా అధికార బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎడి రమేష్ మాట్లాడుతూ.. పదోన్నతిపై ఈ జిల్లాలో ఏ.డీ.గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ.. శాఖా పరంగా, జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలో భాగస్వామ్యులే అని, ప్రభుత్వ ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా, కార్యాలయ నియమ నిబంధనలకు గౌరవిస్తూ.. అందరూ కలిసికట్టుగా స్నేహపూర్వక వాతావరణంలో కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా డీఇఐఇ శ్రీనివాసరావు, పిఆర్వో రవికుమార్, ఏవీఎస్ నాగయ్య, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా తదితరులు నూతన ఏడి కి పుష్ప గృచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్లు సదాశివయ్య, కృపాకర్, ఫోటోగ్రాఫర్ సొహైల్, టైపిస్టులు శ్రీవాణి, వర్ధిని, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మీపతి, అజ్మతుల్లా, టీఏ హరిబాబు, వీరారెడ్డి, విజయ కుమారి, షాహీనా బేగం, ముంతాజ్ బేగం, సునీత, సుభాషిణి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!