కడప, జూలై 9 : కడప జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) అసిస్టెంట్ డైరెక్టర్ (AD) ఏ. రమేష్‌ను ‘తాజావార్త’ పత్రిక ఎడిటర్ యల్లారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏడి రమేష్‌ను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏడి ఏ. రమేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ సమాచారాన్ని, ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను సకాలంలో ప్రజలకు చేరవేయడంలో ముద్రణా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా ఒక బలమైన వారధిగా పనిచేయాలని, నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో పత్రికలు ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
