📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం,--జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం,–జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

📰 Generate e-Paper Clip

యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు ఉల్లాసం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు..అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర క్యాంపెయిన్-2026’ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్  వెల్లడించారు.జూన్ 16న గండికోటలో నిర్వహించనున్న ప్రత్యేక యోగా ప్రదర్శన కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.జూన్ 21న రాజా రెడ్డి స్టేడియంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకల్లో కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ yogandhra.ap.gov.in/#/home/yoga-re… పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్  సూచించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!