📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్17 న మదనపల్లెకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాక

17 న మదనపల్లెకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాక

📰 Generate e-Paper Clip

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు

మదనపల్లి జూన్ 16(కడప మనస్సాక్షి ప్రతినిధి)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జూన్ 17 న బుధవారం ఉదయం 10 గంటలకు మాజీ సీఎం నివాసం కలికిరి నుంచి బయలుదేరి, 10.30 గంటలకు మదనపల్లెలోని ఎన్‌టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులకు కిరణ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణప్ప తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!